: జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్... 12 మంది మావోయిస్టులు హతం
అదను చూసి దాడికి దిగుతున్న మావోయిస్టులు... భద్రతా బలగాలకు సవాల్ విసురుతున్నారు. పదుల సంఖ్యలో పోలీసులను పొట్టనబెట్టుకుంటున్న మావోల దుశ్చర్యలు అసోం, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అయితే నేటి తెల్లవారుజామున మావోలకు పోలీసులు గట్టి షాకిచ్చారు. కాస్త ఏమరపాటుగా ఉన్న మావోలపై పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.