: యోగా దినోత్సవానికి అతిథులు 152 దేశాల ప్రతినిధులు


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న ఢిల్లీలో నిర్వహించనున్న మెగా ఈవెంట్ కు 152 దేశాల రాయబారుల్ని అతిథులుగా కేంద్రం ఆహ్వానించనుంది. రాజ్ పథ్ లో ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో సుమారు 40 నుంచి 50 వేల మంది యోగాసనాలు వేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాని పాల్గొననున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీలో ఉన్న విదేశీ రాయబారులను ఆహ్వానించారు. ప్రతి విదేశీ కార్యాలయం నుంచి ముగ్గురికి పాస్ లు పంపించారు. తొలి ఏడాది కావడంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.

  • Loading...

More Telugu News