: తెలుగు వ్యక్తిని కావడం వల్ల ఇక్కడే నటించాలని ఉంటుంది: జయప్రద
తెలుగు మహిళను కావడం వల్ల మాతృభాషలో నటించాలని ఉంటుందని ప్రముఖ సినీ నటి జయప్రద చెప్పారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతానికి రాజకీయాలను పక్కన పెట్టేశానని అన్నారు. ఇప్పుడు తన దృష్టంతా సినిమాలపైనే ఉందని ఆమె పేర్కొన్నారు. మంచి కథ దొరికితే తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. బాలీవుడ్ లో నటిస్తున్నానని ఆమె వెల్లడించారు.