: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపే నోటిఫికేషన్
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుంది. 12 స్థానాలకు స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు జులై 3న జరుగుతాయని ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. జూన్ 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. జులై 3న పోలింగ్, 7న లెక్కింపు ఉంటాయి. మొత్తం 10,400 మంది ఓటర్లు ఉండగా, వారికి అనుకూలంగా 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని భన్వర్ లాల్ చెప్పారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏపీలోని 9 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.