: 'స్వర్ణాంధ్రకోసం మహాసంకల్పం' తెలుగు, ఆంగ్ల పుస్తకాలు విడుదల


గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న మహాసంకల్ప సభలో తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురించిన 'స్వర్ణాంధ్రకోసం మహాసంకల్పం' అనే పుస్తకాలను గవర్నర్ నరసింహన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వీటిని తీసుకొచ్చారు. అంతకుముందు 'మా తెలుగు తల్లికి...' గీతంతో మహాసంకల్ప సభ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఏపీలోని 13 జిల్లాల నుంచి భారీగా జనం పోటెత్తారు. ఈ సభలోనే ప్రజలందరితో చంద్రబాబు మహాసంకల్ప ప్రతిజ్ఞ చేయించనున్నారు.

  • Loading...

More Telugu News