: తమపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అసత్యం: సిట్


ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని... ప్రతి రోజు విచారణ అనంతరం సిట్ కార్యాలయంలో ఉంచుతున్నారు. ఈ క్రమంలో, తనకు సరైన వసతులు కల్పించడం లేదని... బెంచ్ పై పడుకోబెడుతున్నారని, తాగటానికి కూడా సరిగ్గా మంచినీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనికి సంబంధించి ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కు కూడా టీటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డికి తాము సరైన వసతులన్నీ కల్పిస్తున్నామని సిట్ అధికారులు తెలిపారు. పరిశుభ్రమైన వసతులు కల్పిస్తున్నామని అన్నారు. మినరల్ వాటర్, టీ, స్నాక్స్, కొత్త మంచాలు, పరుపులు ఇచ్చామని తెలిపారు. తమపై రేవంత్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు. రేవంత్ కు తాము ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామో కోర్టుకు తెలియజేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News