: రేణు దేశాయ్ తాజా ట్వీట్ పవన్ ను ఉద్దేశించేనా?
టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ తో వైవాహిక జీవితానికి చరమగీతం పాడి, దర్శకురాలి అవతారమెత్తిన రేణు దేశాయ్ అప్పుడప్పుడు తన ట్వీట్లతో వార్తల్లోకెక్కుతుంటారు. తాజాగా ఆమె ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యపై ఆసక్తి నెలకొంది. పిల్లలున్న మగాళ్లు మళ్లీ పెళ్లి చేసుకున్నా సమస్యేమీ ఉండదని, అదే, పిల్లలున్న మహిళ మళ్లీ వివాహం చేసుకుంటే మాత్రం అదో పెద్ద తప్పు, నిషేధం అన్నట్టు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిగా ఉండాలంటే, మహిళ భావోద్వేగాలను కలిగి ఉండడం మానేయాలని పేర్కొన్నారు. కాగా, రేణు దేశాయ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. పవన్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేణుతో వైవాహిక బంధం తెగిపోయాక పవన్ కల్యాణ్ ఓ విదేశీ భామను పెళ్లాడినట్టు వార్తలు రావడం తెలిసిందే.