: మరో రూ. 90 వేల కోట్లు ఆవిరి!


స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనం మరో రూ. 90 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను హరించి వేసింది. గతవారంలో నమోదైన భారీ నష్టాలు ఈ వారం తొలి సెషన్లోనూ కొనసాగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈక్విటీలను అమ్మి లాభాలను వెనక్కు తీసుకోవడానికే ప్రయత్నించారు. దీనికితోడు దేశవాళీ ఫండ్ సంస్థలు కూడా కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపలేదు. దీంతో మార్కెట్ మరింతగా నష్టపోయింది. సోమవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 245.40 పాయింట్లు పడిపోయి 0.92 శాతం నష్టంతో 26,523.09 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 70.55 పాయింట్లు పడిపోయి 0.87 శాతం నష్టంతో 8,044.15 పాయింట్ల వద్ద కొనసాగాయి. నిఫ్టీ-50లో 38 కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెయిర్న్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా స్టీల్ తదితర కంపెనీలు 3 శాతానికి పైగా నష్టపోగా, టాటా పవర్, ఎన్ఎండీసీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు ఒకటిన్నర శాతం వరకూ లాభపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లు 1.5 శాతం నష్టపోయాయి.

  • Loading...

More Telugu News