: చంద్రబాబుకు వ్యతిరేకంగా తొలిసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన తుమ్మల


ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతిష్టను చంద్రబాబు మంటగలిపారని అక్కడి ప్రజలంతా అనుకుంటున్నారని టీఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏడాది పాలనలో ఏపీలో ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు... తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తప్పు చేశారన్న బాధ ఏపీ మంత్రుల్లో కూడా ఉందని అన్నారు. చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు గాని, టీడీపీకి గాని సంబంధం లేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని... ఒకరేమో రికార్డులో ఉన్న వాయిస్ చంద్రబాబుది కాదు అంటారని... మరొకరేమో చంద్రబాబు పదాలను ముక్కలు ముక్కలుగా చేర్చారని అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారంతో ఏపీ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News