: కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ఏపీ ఐఆర్ఎస్ అధికారి
కేంద్ర నిఘా సంఘం, కేంద్ర సమాచార సంఘాలకు ప్రభుత్వం కొత్త సారధులను నియమించింది. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా కేవీ చౌదరి అలియాస్ కొసరాజు వీరయ్య చౌదరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన కృష్ణా జిల్లా వాసి. అటు ముఖ్య సమాచార కమిషనర్ గా విజయ్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీలో సమాచార కమిషనర్ గా ఉన్నారు. వారిద్దరికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.