: చంద్రబాబుపై సీబీఐ విచారణకు వీహెచ్ డిమాండ్... కేసీఆర్ కు లేఖ
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని వీహెచ్ ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని కోరారు.