: సొంత రాష్ట్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం


ఓటుకు నోటు వ్యవహారం తీవ్ర రూపు దాల్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టేందుకు యత్నించాడంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేయడం, కస్టడీలోకి తీసుకోవడం తెలిసిందే. ఈ వ్యవహారం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారంటూ, అందుకివే సాక్ష్యాలంటూ ఆడియో టేపులు తెరపైకి తెచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో, తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ లోని రాజీవ్ చౌక్ లో టీడీపీ కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేతలు మారుతీరెడ్డి, మోహన్ రెడ్డి, శివాజీ పాటిల్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అటు, ఏపీలో చాలా ప్రాంతాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నలుగురు టీడీపీ కార్యకర్తలు గుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇక, చిలకలూరిపేటలో సాక్షి దినపత్రిక ప్రతులను కాల్చి బూడిద చేశారు. ఏపీలో పలు చోట్ల కేసీఆర్ పై కేసులు నమోదు చేయడం విదితమే.

  • Loading...

More Telugu News