: చంద్రబాబు పేర్కొన్న 'కమిట్ మెంట్' కు అర్థం ఏమిటి?... రేవంత్ పై కొనసాగుతున్న ఏసీబీ విచారణ


ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ నేడు కూడా విచారిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు నగదుతోపాటు ఇంకేమైనా హామీలు ఇచ్చారా? అన్న కోణంలో ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడినవంటూ మీడియాలో వచ్చిన ఆడియో టేపుల్లో, ఆయన నోట 'కమిట్ మెంట్' అన్న మాట వచ్చిందని, దానర్థం ఏంటని అధికారులు ఆరా తీస్తున్నారట. రూ.5 కోట్ల నగదుతో పాటు ఇంకా పలు హామీలు ఇచ్చి ఉంటారని, ఆ హామీలను ఉద్దేశించే చంద్రబాబు "దటీజ్ అవర్ కమిట్ మెంట్" అని పేర్కొని ఉంటాడని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News