: తేనెటీగ దెబ్బకు వెనక్కు మళ్లిన విమానం


ఓ తేనెటీగ కారణంగా ఏకంగా ఒక విమానమే వెనక్కి మళ్లి, అత్యవసరంగా ల్యాండ్ అయింది. వివరాల్లోకి వెళ్తే, యూకేలోని సౌథాంప్టన్ నుంచి డబ్లిన్ వెళుతున్న ఫ్లైబీ బీఈ 384 విమానంలో ఏదో సాంకేతిక సమస్య తలెత్తిందన్న అనుమానం వచ్చిన పైలట్... పది నిమిషాల వ్యవధిలోనే వెనక్కి తిప్పి సౌథాంప్టన్ ఎయిర్ పోర్టులో దించేశాడు. ఆ తర్వాత, సమస్య ఏంటో కనుక్కోవడానికి ఇంజినీరింగ్ సిబ్బంది విమానంలోని అణువణువూ శోధించారు. చివరకు వారికి విమానం వెలుపల ఓ చోట తేనెటీగ చిక్కుకుని కనిపించింది. దాన్ని తొలగించిన తర్వాత విమానం మళ్లీ బయలుదేరింది. దీనికంతటికీ రెండు గంటల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో విమాన యాజమాన్యం స్పందిస్తూ, ప్రయాణికుల క్షేమమే తమకు ప్రధానమని... అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News