: రేవంత్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సమయం కోరిన ఏసీబీ


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఒకరోజు సమయం కోరింది. దాంతో విచారణను ప్రత్యేక కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. వాస్తవానికి ఏసీబీ అధికారులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. మరోవైపు, రేపటితో రేవంత్ ఏసీబీ కస్టడీ ముగుస్తోంది. ఈ క్రమంలో మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్ కు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదన్న ఆయన లాయర్లపై ఏసీబీ అధికారులు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News