: హైకోర్టునే ఆశ్రయించండి... పోలవరం నిర్వాసితులకు సుప్రీంకోర్టు సూచన
పోలవరం నిర్వాసితులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తాము జీవనాధారం కోల్పోతున్నామని చెబుతూ వస్తున్న నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని రాష్ట్ర స్థాయిలోనే పరిష్కంచుకోవాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్లకు సూచిస్తూ నిర్వాసితుల పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో నిర్వాసితులు తిరిగి హైకోర్టునే ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.