: బాబూ, నీకు భయమెందుకు?: వైకాపా నేతగా బొత్స తొలి ప్రెస్ కాన్ఫరెన్స్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత బొత్స సత్యనారాయణ తొలిసారి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో బాబు ఏ విధమైన అక్రమాలకు పాల్పడకుండా ఉండి వుంటే గత వారం రోజులుగా ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. "బాబూ, నీకు భయమెందుకు? నువ్వేమీ తప్పు చేయకుంటే స్వయంగా విచారణకు ఆదేశించు" అని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం పేరిట సింగపూరు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించిన ఆయన, సింగపూరులో బాబుకు వ్యాపారాలున్నాయని, అందుకే ఆ దేశ ప్రభుత్వాన్ని కాకా పడుతూ, వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నాడని దుయ్యబట్టారు.