: రేవంత్ కు ఏమైంది?... డాక్టర్లు ఏం చెప్పారు?
ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, అతన్ని ఈ ఉదయం సిట్ కార్యాలయం నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. అనంతరం రేవంత్ ఆరోగ్య పరిస్థితిని ఉస్మానియా డాక్టర్లు మీడియాకు వివరించారు. హై బీపీతో రేవంత్ బాధపడుతున్నారని, షుగర్ లెవెల్స్ మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, గొంతునొప్పితో బాధపడుతున్నారని, జ్వరం కూడా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, రేవంత్ కు బీపీ కంట్రోల్ కావడానికి ట్యాబ్లెట్లు, యాంటీ బయోటిక్స్ ఇచ్చామని చెప్పారు. అలాగే, ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచించామని... టెన్షన్ కు గురి కాకూడదని చెప్పామని తెలిపారు.