: ఆ గొంతు నూటికి నూరు శాతం బాబుదే: సి.రామచంద్రయ్య
తెరాస ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపులో స్టీఫెన్ సన్ తో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిదేనని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఆడియో టేపులో వినిపించిన గొంతు నూటికి నూరు శాతం చంద్రబాబుదేనన్న రామచంద్రయ్య, అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్ష కూడా చేయించుకోవచ్చన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కైన చంద్రబాబు తక్షణమే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు ఏసీబీ విచారణకూ చంద్రబాబు సిద్ధపడాలని రామచంద్రయ్య అన్నారు.