: ఉమ్మడి రాజధానిలో ఏ హక్కుతో ఫోన్లను ట్యాప్ చేస్తారు?... మా తడాఖా చూపిస్తాం: నన్నపనేని


పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో ఏపీ ముఖ్యమంత్రి ఫోన్ ను ట్యాప్ చేసే అధికారం కేసీఆర్ కు ఎవరిచ్చారని టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈ హడావుడి కొంచెం తగ్గాక తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎవరు రాణిస్తారో, ఎవరు మంచి పేరు తెచ్చుకుంటారో, ఎవరు స్వార్థం కోసం పనిచేస్తున్నారో తెలుస్తుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, దశాబ్దాలుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తిని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News