: తెలుగు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: ఏపీ మంత్రి పీతల సుజాత డిమాండ్


తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకూ పాత్ర ఉందంటూ నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆడియో టేపులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మంత్రి పీతల సుజాత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పురోభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబును టీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. కుట్రపూరిత వైఖరితో వ్యవహరిస్తున్న కేసీఆర్, ఆయన కుటుంబంపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News