: ఒంగోలు, పామర్రు, బాపట్ల, ఇబ్రహీంపట్నం... కేసీఆర్ పై పలు ప్రాంతాల్లో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్రతిష్ఠ పాలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రయత్నించారని ఆరోపిస్తూ పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 'ఓటుకు నోటు' కేసులో బాబు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో టేపులు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ పలు స్టేషన్లలో తెదేపా కార్యకర్తలు, నేతలు కేసులు పెట్టారు. కృష్ణా జిల్లా పామర్రు, ఇబ్రహీంపట్నం, గుంటూరు జిల్లా బాపట్ల, విశాఖ త్రీ టౌన్ పీఎస్, ఒంగోలు, నెల్లూరు... ఇలా పలు చోట్ల కేసీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలా? అన్న విషయమై పోలీసు అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు.