: అంతర్జాతీయంగా 11 వారాల కనిష్ఠానికి, ఇండియాలో 6 వారాల కనిష్ఠానికి బంగారం ధర
బంగారం ధరలు మరింతగా తగ్గాయి. గడచిన వారం రోజుల వ్యవధిలో దేశవాళీ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 380 మేరకు తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ. 26,950 (99.9 ప్యూరిటీ)కు చేరింది. ఈ ధర ఆరు వారాల కనిష్ఠం. ఇదే సమయంలో 99.5 స్వచ్ఛత కల బంగారం ధర రూ. 26,800 వద్ద కొనసాగింది. ఇదిలావుండగా, అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,168 డాలర్లకు దిగజారింది. ఇది 11 వారాల కనిష్ఠం. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న నిపుణుల అంచనాలతోనే బులియన్ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిందని, బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నారు.