: విశాఖలో కేసీఆర్ పై, విజయవాడలో టీ సర్కారు పెద్దలపై కేసులు నమోదు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ వాణిజ్య రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో కలిసి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై కుట్ర పన్నారని ఓ ప్రభుత్వ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు కేసీఆర్ పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే బొండా ఉమాల ఫిర్యాదులతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, అధికారులపై విజయవాడలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.