: తెలంగాణ సర్కారును రద్దు చేయండి... కేంద్రాన్ని కోరనున్న ఏపీ మంత్రులు
తెలుగు రాష్ట్రాల మధ్య ఓటుకు నోటు వ్యవహారం మరింత అగాధాన్ని పెంచింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులను తెలంగాణ సర్కారు నిన్న రాత్రి విడుదల చేసింది. దీనిపై ఏపీ సర్కారు భగ్గుమంది. నిన్న రాత్రే మీడియా ముందుకు వచ్చిన ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలంగాణ సర్కారు చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేసీఆర్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఏపీ మంత్రులు సిద్ధమవుతున్నారు. ఆడియో టేపులను విడుదల చేసిన తెలంగాణ సర్కారును రద్దు చేయాలని ఏపీ మంత్రులు కేంద్రాన్ని కోరనున్నారు.