: బెజవాడ బయలుదేరిన బాబు.. మహా సంకల్ప వేదికకు వెడలిన ఏపీ సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరివెళ్లారు. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీ సమీపంలో మహా సంకల్పం పేరిట ఏపీ సర్కారు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. నిన్న రాత్రికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభలో చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. ఏడాది పాలనలో ఎదురైన సవాళ్లతో పాటు భవిష్యత్తు ప్రణాళికను కూడా చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. ఇక విజయవాడలో కొత్తగా సిద్ధమైన సీఎం క్యాంపు కార్యాలయానికి కూడా చంద్రబాబు ప్రారంభోత్సవం చేయనున్నారు.