: కానిస్టేబుల్ ఇంటి ముందు ప్రియురాలి మౌనపోరాటం
తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ కానిస్టేబుల్ ఇంటి ముందు అతని ప్రియురాలు మౌనపోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతారంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాము ఇంటి ముందు అతని ప్రియురాలు బైఠాయించింది. తనను ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని చెప్పి... ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమమయ్యాడని తన మౌనపోరాటానికి ముందు ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటాన్ని ఆపనని ఆమె స్పష్టం చేసింది. ఈ మౌనపోరాటం స్థానికంగా సంచలనంగా మారింది.