: ప్రారంభమైన తెలంగాణ ఆవిర్భావ ముగింపు వేడుకలు... హాజరైన గవర్నర్, కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావ వేడుకల ముగింపు ఉత్సవాలు ట్యాంక్ బండ్ పై ప్రారంభమయ్యాయి. కాసేపటి క్రితమే గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా వేడుకలకు హాజరయ్యారు. గవర్నర్ కారు వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. అంతకు ముందు పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా పాలుపంచుకున్నారు. మరోవైపు, రంగురంగుల విద్యుత్ దీపాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు జిగేల్ మంటున్నాయి. ఎలక్ట్రానిక్ పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.