: ప్రకటనలకు రూ. 400 కోట్లు ఖర్చుపెట్టిన మ్యాగీ... నాణ్యత పరీక్షలను మాత్రం గాలికొదిలేసింది


మోతాదుకు మించిన స్థాయిలో సీసం ఉందని పరీక్షల్లో తేలిన నేపథ్యంలో, మ్యాగీ నూడుల్స్ దేశవ్యాప్తంగా నిషేధం ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో, కొన్ని విస్తుగొలిపే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేసిన మ్యాగీ... నాణ్యత పరీక్షల కోసం ఖర్చు చేసింది మాత్రం అంతంతమాత్రమే. గత ఏడాది ప్రచారం కోసం మ్యాగీ ఏకంగా రూ. 445 కోట్లు ఖర్చు చేసింది. ఇదే సమయంలో, తన ఉత్పత్తుల్లో నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవడానికి చేసిన ఖర్చు మాత్రం రూ. 19 కోట్లే. అంటే, ప్రచారం కోసం ఖర్చు చేసిన మొత్తంలో ఐదో వంతు కూడా పరీక్షల కోసం ఖర్చు చేయలేదన్నమాట. మన దేశంలో నెస్లే సంస్థ తన ఉత్పత్తులకు సంబంధించి రూపొందించే వార్షిక నివేదికలో ఈ అంశం వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News