: ఢిల్లీకి నరసింహన్, చంద్రబాబు, కేసీఆర్... రేవంత్ వ్యవహారమే కారణమా?


దేశ రాజధాని ఢిల్లీకి ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళుతున్నారు. తొలుత ఈ నెల 9న నరసింహన్, చంద్రబాబు వెళతారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అంతేకాకుండా, 10న చైనా ప్రతినిధులతో భేటీ అవుతారు. 11, 12 తేదీల్లో కూడా నరసింహన్ ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. 12న కేసీఆర్ హస్తినకు వెళుతున్నారు. ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు తదితర అంశాల నేపథ్యంలో, వీరి ఢిల్లీ పయనం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరి అజెండా వారు చెబుతున్నప్పటికీ, రేవంత్ వ్యవహారానికి సంబంధించే, వీరు ఢిల్లీ బాట పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News