: చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు బొత్సకు లేదు: ఏపీ మంత్రి దేవినేని ఉమా
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు లేదని ఏపీ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నేటి ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిన బొత్స, అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బొత్స వ్యాఖ్యలపై టీడీపీ వేగంగా స్పందించింది. వోక్స్ వ్యాగన్ కంపెనీ పెట్టుబడులంటూ ఊదరగొట్టి కోట్లాది రూపాయలు దండుకున్న బొత్సకు చంద్రబాబును విమర్శించే హక్కు లేదని ఆయన తేల్చిచెప్పారు. వైఎస్ పాలనలో బొత్స నీతిబాహ్య చర్యలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు.