: ట్రైనీ కానిస్టేబుల్ పై ఫైర్ ఆఫీసర్ చెప్పుతో దాడి... రాజమండ్రిలో కానిస్టేబుళ్ల ధర్నా
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అగ్నిమాపక శాఖకు చెందిన కానిస్టేబుళ్లు ధర్నాకు దిగారు. ఇటీవలే ఆ శాఖ కానిస్టేబుల్ గా ఎంపికై శిక్షణ పొందుతున్న యువకుడిపై అక్కడి అడిషనల్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ చెప్పుతో దాడి చేశారు. దీనికి నిరసనగా కానిస్టేబుళ్లు ధర్నాకు దిగారు. వివరాల్లోకెళితే... ఇటీవలే అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ గా ఎంపికైన రెడ్డి అనే యువకుడు అమలాపురంలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈతలో శిక్షణ కోసం 100 మందితో కలిసి అతడు రాజమండ్రికి వచ్చాడు. ఈ క్రమంలో రాజమండ్రిలో అడిషనల్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కృపావరం, రెడ్డిని చెప్పుతో కొట్టారు. దీంతో రెడ్డి సహచరులు కృపావరం చర్యను నిరసిస్తూ ఆందోళనకు దిగారు.