: ఏపీ అభివృద్ధికి వెంకయ్య ఎంతో సహకరిస్తున్నారు: సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎంతగానో సహకరిస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్ర మంత్రులు వెంకయ్య, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరీలతో కలిసి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కడప విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాకు గండికోట నీటిని తీసుకొస్తామన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతిని త్వరలో పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పారు.