: ‘వెంకటగిరి చేనేత’కు అరుదైన గౌరవం...జరీ చీరను హసీనాకు కానుకగా ఇచ్చిన మోదీ
వెంకటగిరి చేనేత కీర్తి ప్రతిష్ఠలు ఎల్లలు దాటాయి. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన చీరను భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు కానుకగా ఇచ్చారు. నిన్న బంగ్లా పర్యటనకు వెళ్లిన మోదీకి ఢాకా విమానాశ్రయానికి వచ్చిన హసీనా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ, హసీనాకు వెంకటగిరి జరీ చీరను కానుకగా ఇచ్చారు. నేత కార్మికుడు గౌరబత్తిన వెంకటరమణయ్య నేసిన ఈ చీరపై కల్పవృక్షంతో పాటు కామధేనువు బొమ్మలున్నాయి. ఈ బొమ్మలను బంగారంతో నేశారట.