: 29 ఏళ్ల రహస్యాన్ని విప్పిన బ్రిటన్ మంత్రి
బ్రిటన్ పాఠశాలల మంత్రి నిక్ గిబ్ 29 ఏళ్ల రహస్యాన్ని బయటపెట్టారు. 54 ఏళ్ల నిక్ గిబ్ తాను 'గే'నని ప్రకటించారు. తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదని, 'గే'ననే విషయం తెలిసిన తన 79 ఏళ్ల తల్లి షాక్ కు గురైందని, తరువాత జీర్ణించుకుందని నిక్ గిబ్ వెల్లడించారు. తన సహచరుడు, ఓ సంస్థ సీఈవో అయిన మైకేల్ సిమండ్స్ ను తాను వివాహమాడనున్నట్టు ప్రకటించారు. 29 ఏళ్ల రహస్య సహజీవనానికి స్వస్తి పలికి, వివాహం చేసుకోనున్నామని ఆయన ఆనందంగా తెలిపారు. సహజీవనంలో ఇన్నాళ్లు ఆనందంగా ఉన్నామని తెలిపిన ఆయన, వివాహం కేవలం అధికారిక లాంఛనం మాత్రమేనని చెప్పారు. కాగా, లక్సెంబర్గ్ ప్రధాని 'గే'వివాహం తరువాత పలువురు ప్రముఖులు తాము 'గే'లమనే విషయాన్ని బహిరంగపరుస్తున్నారు.