: ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం చూపిన మ్యాగీ నూడిల్స్
మ్యాగీ నూడిల్స్ ఇతర రెడీమేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ పై ప్రభావం చూపుతున్నాయి. నిషేధిత పదార్థాలను పరిమితికి మించి వాడారని మ్యాగీ నూడిల్స్ ను దేశవ్యాప్తంగా నిషేధించిన సంగతి తెలిసిందే. కేవలం మ్యాగీయే ఇలాంటి చర్యలకు పాల్పడిందా? లేక ఇతర కంపెనీలు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాయా? అనేది తేల్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీంతో, రెడీ మేడ్ నూడిల్స్ అమ్ముతున్న పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ప్రభుత్వం పరీక్షిస్తోంది. అంతటితో ఆగకుండా మేకరోనీ, పాస్తా, ఇతర స్నాక్స్ ను కూడా పరీక్షించనున్నట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో యుధ్ వీర్ సింగ్ మాలిక్ తెలిపారు.