: రేవంత్ పై ప్రశ్నల వర్షం... ఏమేం తెలుసుకున్నారో?
తొలి రోజు విచారణలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. బంజారాహిల్స్ లో జరిగిన ఈ విచారణలో రేవంత్ ను అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారట. వారు రేవంత్ ను ఏ కోణంలో ప్రశ్నించారన్నది వెల్లడికాలేదు. అటు, రేవంత్ ను విచారణ ముగిసిన అనంతరం ఎక్కడికి తరలించారన్న దానిపైనా స్పష్టత లేదు. సిట్ కార్యాలయానికి గానీ, చర్లపల్లి జైలుకు గానీ తరలించి ఉండొచ్చని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిసింది. ఆయనను రేపు ఉదయం తిరిగి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలిస్తారు. కాగా, శనివారం ఉదయం రేవంత్ వ్యవహారంలో హైడ్రామా నడిచింది. రేవంత్ ను చర్లపల్లి నుంచి రహస్య ప్రాంతానికి తరలించారంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.