: రేవంత్ కేసులో మీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి...!: టీడీపీ నేతలను భయపెడుతున్న టీఆర్ఎస్?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష ఊపందుకుంది. టీడీపీ నేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో దీనిని టీఆర్ఎస్ నేతలు అవకాశంగా మలచుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన టీఆర్ఎస్ నేతలు ద్వితీయ శ్రేణి నాయకులను టీడీపీ నేతల వద్దకు పంపి, వారితో ఆపరేషన్ ఆకర్షను అమలు చేస్తున్నట్టు తెదేపా వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి కేసులో ఏసీబీ అధికారులు పలు కీలక ఆధారాలు, సాక్ష్యాలు సేకరించారని, వాటిలో మీ పేరు కూడా ఉందని, టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరితే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, లేని పక్షంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నట్టు సమాచారం. దీంతో టీడీపీ భవన్ లో పార్టీ జిల్లా స్థాయి అధ్యక్షులు సమావేశమయ్యారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా? అని సమాలోచనలు చేస్తున్నారు.