: చంద్రబాబుకు సీపీఐ రాష్ట్రశాఖ హెచ్చరిక


ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఐ రాష్ట్రశాఖ ధ్వజమెత్తింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా ముందుకెళుతున్నారని, విపక్షాలను సంప్రదించడం లేదని ఆరోపించారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. రాజధాని భూమిపూజకు ప్రభుత్వం ఎవరినీ పిలవలేదని తెలిపారు. ఎవరి సలహాలు స్వీకరించడం లేదని, రాజధాని అంశంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే కనిపిస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో స్థానికుల సమస్యలు పట్టించుకోకుండా, సింగపూర్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News