: యువతులను వ్యభిచారంలోకి లాగుతున్న టీవీ న్యూస్‌ రీడర్ అరెస్ట్!


అమ్మాయిలను మోసం చేసి వారిని వ్యభిచార కూపంలోకి లాగుతోందన్న ఆరోపణలపై ఓ టీవీ చానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న యువతిని కదిరి పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. అమెతో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఓ కంప్యూటర్, మూడు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కదిరి, ఆర్‌ ఎస్ రోడ్డుకు చెందిన యువతి, గత కొంత కాలంగా కనిపించకుండా పోయింది. వెళ్లే ముందు ఒక ఉత్తరం రాసిపెట్టింది. సదరు న్యూస్ రీడర్ తనను వ్యభిచారంలోకి దించిందని, నగ్న దృశ్యాలను చిత్రీకరించి వాట్స్ యాప్ ద్వారా చాలా మందికి పంపించిందని లేఖలో రాసింది. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ రాసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యూస్ రీడరును అదుపులోకి తీసుకోగా, ఆమెను తప్పించాలని రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News