: అమీర్ ఖాన్ కు లీగల్ నోటీసు
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు ఓ ఉద్యమకారుడు లీగల్ నోటీసు పంపారు. సత్యమేవ జయతే కార్యక్రమం టైటిల్లో దేశ చిహ్నాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ మనోరంజన్ రాయ్ అనే ఉద్యమకారుడు న్యాయవాది మనోజ్ సింగ్ ద్వారా నోటీసు పంపారు. అంతేగాకుండా, 'సత్యమేవ జయతే' అన్న వాక్యం కూడా జాతీయ చిహ్నంలో భాగమని మనోరంజన్ రాయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా చిహ్నాన్ని ఉపయోగించారని అన్నారు. నోటీసు గ్రహీతలుగా అమీర్ ఖాన్, ఆయన అర్ధాంగి కిరణ్ రావు, కార్యక్రమ దర్శకుడు సత్యజిత్ భత్కల్ లను పేర్కొన్నారు. ఇతరత్రా ప్రయోజనాల కోసం జాతీయ చిహ్నాన్ని వినియోగించడం కుదరదని ఆ నోటీసులో పేర్కొన్నారు.