: విద్యుత్ కోతలు, రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపమే: మంత్రి పోచారం


తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలకు కాంగ్రెస్ కారణమంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరావు ఆరోపించారు. వాటి పాపం కాంగ్రెస్ దేనని విమర్శించారు. పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనతో రైతులకు ఒరిగిందేమీలేదని అన్నారు. తమ ప్రభుత్వంపై వ్యంగ్యంగా మాట్లాడే వారికి సర్కారు పనితీరే సమాధానమని మంత్రి పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పోచారం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, హామీ ఇచ్చినట్టుగా రైతులకు రుణమాఫీ చేశామని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News