: ఐఎస్ఐఎస్ చేతుల్లో విధ్వంసం సృష్టించే సరికొత్త ఆయుధాలు!


ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతుల్లో రసాయన ఆయుధాలు ఉన్నాయని, వీటితో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదముందని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖా మంత్రి జూలీ బిషప్ హెచ్చరించారు. వీరు క్లోరిన్ ను ఆయుధంగా వాడుతున్నారని, రసాయన ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున సాంకేతిక నిపుణులను చేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం ఇదేనని ఆయన అన్నారు. రసాయన ఆయుధాలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎంతో ప్రతిభగల వేలాదిమంది నిపుణులను చేర్చుకుంటూ, రసాయన ఆయుధాల అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రపంచం తరలిరావాలని కోరారు. కాగా, క్లోరిన్ గ్యాస్ ను సైన్యంపై ఆయుధంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వాడుతున్నారని ఇరాకీ కుర్దిష్ అధికారులు సైతం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News