: చిన్న వయసులోనే క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్


క్రికెట్ లో ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆటగాళ్లు గాయపడిన సంఘటనలు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. గతేడాది కౌంటీ క్రికెట్ సందర్భంగా గాయపడిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ క్రెయిగ్ కీస్వెటర్ ఇప్పుడు విషాదకర రీతిలో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 27 ఏళ్లకే క్రికెట్ నుంచి వైదొలగాల్సి రావడం నిజంగా బాధాకరమని కీస్వెటర్ అన్నాడు. సోమర్సెట్ కు ఆడుతుండగా కీస్వెటర్ కంటికి గాయం అయింది. ముక్కు కూడా పగిలింది. కంటి గాయం కారణంగా ఇక క్రికెట్ పూర్తి స్థాయిలో ఆడే వీల్లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ టాలెంటెడ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News