: వెంటాడిన రాహుకాలం, ఆగిన బాబు క్యాంప్ కార్యాలయ ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం రద్దయింది. ముందుగా పెట్టుకున్న ముహూర్తం దాటిపోయి, రాహుకాలం ప్రవేశించడంతో క్యాంపు ఆఫీస్ ప్రారంభాన్ని రద్దు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. తిరిగి 8వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. వాస్తవానికి అమరావతి భూమిపూజ అనుకున్న సమయానికే పూర్తి అయినప్పటికీ, ఆ తరువాత మందడం, తుళ్లూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలతో బాబు చాలా సేపు గడిపారు. అనంతరం బహిరంగ సభ కూడా ముందు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దీనికితోడు నేడు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకూ రాహుకాలం ఉంది. అందువల్ల ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకోవాలని పండితులు సూచించడంతో బాబు సరేనన్నట్టు తెలిసింది.