: రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయంపై అనుమానాలు వద్దు: నిర్మలా సీతారామన్


ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందా? లేదా? అని అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో జరిగిన రాజధాని భూమి పూజలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కాబట్టి కేంద్ర సాయంపై అనవసర చర్చలు సరికాదని మంత్రి సూచించారు. రాజధాని భూమి పూజకు చిరు జల్లులు పడటం శుభసూచకమని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News