: దాసరి కుమారుడు, నటుడు అరుణ్ ఇంట్లో భారీ చోరీ
గత రాత్రి హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లో భారీ చోరీ జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు, నటుడు అరుణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ. 7 లక్షల విలువైన బంగారం, వాచీలతో పాటు రూ. 3 లక్షల నగదును దొంగలు అపహరించారు. ఈ విషయాన్ని అరుణ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అరుణ్ ఇంటికి వెళ్లి అక్కడి వేలిముద్రలు సేకరించే పనిలో పడ్డారు. ఈ దొంగతనం పాత నేరస్తుల పనే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.