: ఒంగోలు గిత్తలను అదిలించిన చంద్రబాబు
ఏపీ రాజధాని నగరం అమరావతికి భూమిపూజ చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒంగోలు గిత్తలు కట్టివున్న అరకను పట్టి పొలం దున్నారు. హలయజ్ఞంలో భాగంగా ఒకచేత్తో నాగలిని భూమిలోకి ఒత్తిపట్టి, మరోచేత్తో చర్నాకోలతో గిత్తలను అదిలిస్తూ, వాటిని ముందుకు నడిపించారు. ఇదే సమయంలో ఆయన సతీమణి భువనేశ్వరి పొలంలో నవధాన్యాలను చల్లారు. అంతకుముందు మందడం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భూమిపూజ పీటలపై కూర్చున్న చంద్రబాబు దంపతులకు బట్టలు పెట్టి వారి ఆశీర్వాదం పొందారు. వేదపండితులు బాబు దంపతులకు ఆశీర్వచనం పలికారు.