: పూజల కోసం వేచి చూస్తున్న తెలంగాణ దేవుళ్లు


తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అర్చకులు చేపట్టిన సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. దీంతో తెలంగాణలో దేవుళ్లంతా పూజల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మంది అర్చకులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ ఉదయం కూడా వందలాది దేవాలయాల తలుపులు తెరచుకోలేదు. దేవాదాయ శాఖ అర్చకులు, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కేవలం రూ. 3 వేల నుంచి రూ. 5 వేలు మాత్రమే వేతనాలు అందుతున్నాయని, హైదరాబాదు వంటి నగరంలో జీవనం గడవాలంటే కనీసం రూ. 15 వేల నుంచి రూ. 20 వేలన్నా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గురువారం నుంచి తెలంగాణలోని 2 వేల పెద్ద, 10 వేలకు పైగా చిన్న దేవాలయాలు ఈ సమ్మె కారణంగా మూతపడగా, భక్తులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

  • Loading...

More Telugu News