: ‘ట్యాపింగ్‌’పై ఏపీ సీరియస్... ఆధారాలుంటే కేసీఆర్ పైనా కేసు


ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు నగరంలో ఏపీ రాజకీయ నేతలు, అధికారుల ఫోన్ల ట్యాపింగ్‌ జరుగుతోందని వస్తున్న వార్తలు ఇరు రాష్ట్రాల మధ్య కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. హైదరాబాదులో ట్యాపింగ్‌ జరుగుతున్న అంశాన్ని పోలీస్‌ శాఖ చాలా సీరియస్‌ గా తీసుకొంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు విచారణకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయన్న సమాచారాన్ని సేకరించడంలో పోలీసు శాఖ బిజీగా ఉంది. ఆధారాలు దొరికితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా కేసు నమోదు చేసేందుకు వెనుకాడకూడదని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న నగరంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ హైదరాబాదు నుంచే పాలన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు తమ ఫోన్లలో ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు చేస్తున్న ప్రకటనలను ఏపీ పోలీస్‌ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఎవరిఫోన్లను ట్యాప్ చేయాలన్న విషయమై స్పష్టమైన నిబంధనలు, చట్టాలు అమలులో ఉన్నాయని, వాటికి విరుద్ధంగా తెలంగాణ అధికారులు ఫోన్లు ట్యాప్ చేసినట్టు తమకు సమాచారం ఉందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News